పరిగి: వికారాబాద్ (Vikarabad) జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ (Congress) నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగుతుండగా, మరికొందరు నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి (MLA Ram Mohan Reddy) ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకు కూర్చున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన సొంత గ్రామం దోమ మండలంలోని శివారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మొదటి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో ఓటమిని ఎదురుచూశారు. అలా తనకు కూడా కావొద్దని అనుకున్నారో ఏమో.. ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చి వేసుకుని కూర్చుకున్నారు. ఓటేస్తానికి వెళ్లే వారిని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రం వద్ద కూర్చున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరిలో ఓడిపోతే పరువుపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
సొంత ఊరిలో పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని కూర్చొని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి
సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పరువుపోతుందని, గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారెడ్డిపల్లిలో పోలింగ్ కేంద్రం… pic.twitter.com/34vcHcsQFG
— Telugu Scribe (@TeluguScribe) December 17, 2025