హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ తప్పు చేస్తే వందశాతం శిక్ష తప్పదని ఆ పార్టీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడి యో విడుదల చేశారు. బండి కుమారుడు తప్పు చేశాడా? లేదా? అనేది సిట్ విచారణలో తేలుతుందని చెప్పారు. మీడియా, యూట్యూబ్ కథనాల ఆధారంగా బీజేపీ, బండి సంజయ్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నా కొడుకు అమాయకుడు అని బండి సంజయ్ చెబితే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి. కానీ, ఎక్కడా సంజయ్ అలా చెప్పడం లేదుకదా అని ప్రశ్నించారు.