మంచిర్యాల, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రేపు ఎమ్మెల్యే వస్తున్నా డు.. ఈ భూమిలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం శంకుస్థాపన చేస్తాడు. అందుకే భూ మిని చదును చేస్తున్నాం. ఇది మీ పట్టాభూమి అయితే మాకేంటి? ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. మా పనులకు ఎవరైనా అడ్డం వస్తే చంపేయాలని కూడా ఎమ్మెల్యే చెప్పారు’ అంటూ కాంగ్రెస్ నేత లు బెదిరించారని మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళారైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా ర్యాలీ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు భూమిపూజ చేశారు.
ఆ భూమి తమకు వారసత్వంగా వచ్చిందని, పట్టా కూడా ఉందని, బీఆర్ఎస్ హయాంలోనే కాకుండా ఇటీవల కూడా రైతుబంధు వచ్చిందని గిరిజన మహిళారైతు అజ్మీరా లక్ష్మి చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు భూమిపై వివాదం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం కలెక్టర్ కుమార్‌దీపక్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపా రు. ఆర్డీవోను పిలిచి వివరాలు అడిగారు. పట్టాభూమిలో ఇండ్లకు శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నించారు. విచారణ జరిపి నివేదికివ్వాలని ఆదేశించారు. న్యాయం చేస్తామని, భయపడొద్దని భరోసా కల్పించారు.
గ్రామంలోని సర్వే నంబర్ 129/ఆ/2బీలో రెండు ఎకరాల రెండు గుంటల భూమి ఉంది. తన భర్త అజ్మీరా చందుకు వారసత్వంగా వచ్చిందని లక్ష్మి చెప్తున్నారు. ఇందులో ఎకరం భూమిని ఆదివారం మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త పవ్యావుల ముని చదును చేయించారని తెలిపారు. మునికి ఫోన్ చేసి భూమి ఎందుకు దున్నుతున్నారని అడిగామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారని, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చెప్పినందుకే చదును చేస్తున్నామని, అడ్డొస్తే చంపేయాలని ముని తెలిపారని చెప్పారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని చెప్పినట్టు వా పోయారు. ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రయత్నించగా నిరాకరించారని చెప్పారు.