జనగామ, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ‘నీటి ప్రాజెక్టులకు అడ్డు పడితే ఊరుకునేది లేదు.. బీఆర్ఎస్ పభుత్వ హయాంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చింది.. మా పాలనలో ఏం అభివృద్ధ్ది జరిగింది..? ఈ ప్రభు త్వ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలే గ్రహించాలి..?..అధికారం ఉన్నా, లేకున్నా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా’ అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని 52 చెరువులకు సాగునీరు అందించే దేవాదుల ప్రాజెక్టు గండిరామారం రిజర్వాయర్ మొదటి లిఫ్ట్ పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.
దేవాదుల ప్రాజెక్టుతో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.104 కోట్లతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టిందని గుర్తుచేశారు. తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాలు, తండాలను సస్యశ్యామలంగా మార్చేందుకు అప్పటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి లిఫ్ట్-1 ఇరిగేషన్ కింద రూ. 63.80 కోట్లు మంజూరు చేయించానని చె ప్పారు.
ఇప్పటికే రెండు లిఫ్ట్‌ల పనులు పూ ర్తి అయ్యాయని.. చెరువుల్లోకి నీళ్లు రావడంతో 70 టన్నుల చేపలతో మత్స్య సం పద పెరిగిందని గుర్తుచేశారు. లిఫ్ట్-1 పను లు వానకాలం వరకు పూర్తి చేసి నీళ్లు అం దిస్తామని అధికారులు చెబుతున్నారని పే ర్కొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మె ల్యే పల్లా ప్రారంభించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా బీఆర్ఎస్, ఎమ్మెల్యే పల్లాకు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.