జనగామ, మే 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అంటేనే మోసం.. ఆ పార్టీ నాయకులు చేస్తున్నదంతా దగా.. పూటకో మాట.. రోజుకో అబద్ధంతో పబ్బం గడుపుకొనే అసమర్థ పాలకులు తెలంగాణకు శనిలా పట్టారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు.
మంగళవారం జనగామలో మాట్లాడుతూ.. వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నాడు సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని వేర్వేరుగా అనలేదని, ఇప్పుడు సన్నవడ్లకే రూ.500 బోనస్ ప్రకటిస్తామనడం ఏమిటని నిలదీశారు.