జనగామ, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకపక్క సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంటే.. మూలిగే నకపై తాటిపండు పడ్డచందంగా మరింత గాయపరిచేలా ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే చర్య ఎందుకు తీసుకోవడం లేదని కార్యకర్తలు తమను అడిగారని పేర్కొన్నారు. కేసీఆర్ సమయం చూసి సముచిత నిర్ణయం తీసుకుంటారని నచ్చజెప్పామని తెలిపారు.
పార్టీ, కార్యకర్తల కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని తెలిపారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా, కూతురైనా ఉపేక్షించేది లేదని తేల్చిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను సరిచేసుకుంటారని సమయం ఇచ్చారని, మారుతుందేమోనని వేచిచూశారని, అయి నా కాంగ్రెస్ కుట్రలకు ఆమె బలైపోయారని, పార్టీ బలికావొద్దనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.