వేలేరు, ఏప్రిల్ 16: దేవాదుల ప్రాజెక్ట్‌కు 2014లో తెలంగాణ ప్రభుత్వంలో రూ. 8వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసింది మాజీ సీఎం కేసీఆర్ మాత్రమేనని, స్టేషన్ ఘన్పూర్ నియోజకర్గంలో ఎమ్మెల్యే కడి యం శ్రీహరి చేసిన అభివృద్ధి శూన్యమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో మాజీ ఎమ్మెలే డాక్టర్ రాజయ్య అధ్యక్షతన వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ మండలాల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం లో ఆయన మాట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 2004 నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగానే గెలవలేదని, అభివృద్ధి ఎలా చేశాడో చెప్పాలని ప్రశ్నించారు.
అప్ప టి టీడీపీ ప్రభుత్వంలో దేవాదుల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి వదిలేస్తే డాక్టర్ రాజయ్య దేవాదుల ప్రాజెక్ట్ వద్ద పిండాలు పెట్టి నిరసన తెలిపిన విషయం మర్చిపోయారా అని విమర్శించారు. పలు పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సభపై రూపొందించిన పాటల సీడీని పల్లా ఆవిష్కరించారు.