జనగామ : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని, పండిన పంటలకు రూ.500 బోనస్‌ఇస్తామని కాంగ్రెస్‌పార్టీ(Congress)రైతులను మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడారు. 2014లో జనగామ జిల్లాలో తెలంగాణ రాక ముందు పండిన వరి పంట, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మూడు రెట్లు పెరిగిందన్నారు.
తెలంగాణలో గతంలో ఒక పంట పండేది, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పంటలు పండేలా కేసీఆర్ చేసిన కృషి ఎంతో ఉందని కొనియాడారు. నిన్న క్యాబినెట్ మీటింగ్‌లో రైతులకు నిరాశే ఎదురైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిసెంబర్ 09న రూ.2 లక్షల రుణమాఫీ అవుతుందని రైతులు సంతోషపడ్డారని, కానీ అది అమలు కాలేదన్నారు.
ఆ తర్వాత 100 రోజుల్లో చేస్తామని మోసం చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ ఆగస్టు అని హామీలిస్తున్నారని మండిపడ్డారు. రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రైతుల పిల్లలైన పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) బీఆర్ఎస్అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.