హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 14: సీఎం రేవంత్ ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. లగచర్ల రైతులు ప్రభుత్వానికి తమ భూములు ఇవ్వమంటూ వేడుకున్నప్పటికీ వినకుండా దౌర్జన్యంగా లాకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేవారందరినీ అరెస్టు చేస్తున్నారని, ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని అరెస్టు చేస్తారని అకడకడ వినిపిస్తున్నాయని చెప్పారు. కేటీఆర్‌ని ముట్టుకోవాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హుజూరాబాద్‌లో దళితబంధు రెండోవిడత నిధులు రాలేదంటూ నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలపై కేసులు పెట్టించి, వారితో అసభ్యంగా ప్రవర్తించడం హేయనీయమన్నారు. ఈ విషయమై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే తనపై 30 కేసులు పెట్టారని గుర్తుచేశారు. హీరో అల్లుఅర్జున్ ఒక వేదికపై ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించక పోవడంతోనే అరెస్టు చేయించారని ఆరోపించారు.