Padi Kaushik Reddy | హుజురాబాద్‌లో డంపింగ్ యార్డును రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినా హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే చెత్త మొత్తం మా హుజురాబాద్ కు తీసుకురావడం ఎందుకు? మా ప్రజలు ఏం తప్పు చేశారు? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
నిన్న నేను హుజురాబాద్ బంద్‌కు పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి అద్భుతంగా విజయవంతం చేశారని తెలిపారు. ఒక్క దుకాణం కూడా తెరవకుండా ప్రజలు ఐక్యంగా నిలబడి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారని పేర్కొన్నారు. ఇది హుజురాబాద్ ప్రజల ఆవేదనకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నా మీద కోపం ఉంటే నాపై చర్యలు తీసుకోండి. కానీ హుజురాబాద్ ప్రజలను శిక్షించకండి అని కోరారు. ఇతర ప్రాంతాల చెత్తను మా హుజురాబాద్ పై మోపాలని ప్రయత్నించడం అన్యాయమని అన్నారు.
నిన్నటి బంద్‌తో ప్రభుత్వం మేల్కొని వెంటనే డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏప్రిల్ 7 ఉదయం 10 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతానని ప్రకటించారు. ప్రజల కోసం పోరాటం ఆగదని, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు