హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని బ్లాక్మెయిల్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాం డ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవా రం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
అర్ధరాత్రి వేళ సీఎం రేవంత్‌రెడ్డి ‘మై హోం భుజా’కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై రేవంత్‌రెడ్డి కావాలనే బుర దజల్లుతున్నారని మండిపడ్డారు. 118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారి ఫోన్లను కూడా రేవంత్ ట్యాప్ చేయించారని పేర్కొన్నారు.
తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి ఏడు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కౌశిక్‌రెడ్డి తెలిపారు. తనతోపాటు తన భార్య, డ్రైవర్, మేనేజర్ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నట్టు చెప్పారు. ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న మాటలు విని రేవంత్‌రెడ్డి వారిని బెదిరించారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపిం గ్ జరగలేదని పేర్కొన్నారు.
తమ ఫోన్లు ట్యాప్ చేసిన రేవంత్‌పై మంత్రులు ఆగ్రహంతో ఉన్నారని, అందు కే వారు క్యాబినెట్ భేటీకి హాజరు కాకుం డా ఢిల్లీలో మకాం వేశారని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. అధిష్ఠానంతో తాడోపేడో తే ల్చుకునేందుకు వారు సిద్ధమయ్యారని తెలిపారు. రేవంత్ ఇకనైనా ట్యాపింగ్, కాళేశ్వరం వంటి మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ప్రశ్నించే వారి గొం తులు నొక్కేందుకే కేసుల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలయ్యే వరకు ఈ సర్కారును నిలదీస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే సంజయ్ విమర్శించారు. ఆయనకు దొంగతనం చేయడం వచ్చు, దొరికిపోవడమూ వచ్చని ఎద్దేవా చేశారు. రేవంత్ ఒక మానసిక రోగి అని, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్‌నే ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ కారు రేసులో ఏ తప్పు జరగలేదని స్వయంగా క్యాబినెట్ మంత్రులే స్వయంగా చెప్తున్నారని తెలిపారు. రేవంత్ ఇకనైనా తన వంకరబుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు.