హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పోలీస్ ఉద్యోగాల భర్తీకి సమంబంధించిన జీవో 46ను సవరించాలని ఉమ్మ డి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆయనను కలి సి వినతిపత్రాన్ని అందించారు. జీవో నుంచి కోడ్ నం.24 టీఎస్ఎస్పీ(5000)ను మినహాయించాలని కోరారు. సీడీ-1, సీడీ-1 ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని విన్నవించారు. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, పద్మావతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బాలు నాయక్, అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, సామ్యూల్, బత్తుల లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.