మహబూబాబాద్ రూరల్, జూన్ 8 : మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్‌కు ఆదివారం నిరసన సెగ తగిలింది. పట్టణానికి చెందిన డాక్టర్ ప్రమోద్‌రెడ్డి పదిమంది గిరిజన రైతులకు సంబంధించిన 30 ఎకరాల భూమిని ఆక్రమించి, అందులో పెద్దపెద్ద భవనాలతోపాటు పాఠశాల భవనాన్ని సైతం నిర్మించాడని ఆరోపించారు. ఆదివారం స్కూల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెళ్తున్న క్రమంలో గిరిజన రైతులు ఆయన కారుని అడ్డుకొని రోడ్డుపైన ఆందోళన చేశారు.
గిరిజన రైతులకు అండగా నిలవాల్సిందిపోయి ప్రమోద్‌రెడ్డికి సపోర్ట్ చేస్తూ పాఠశాల ప్రారంభోత్సవానికి ఎలా వెళ్తారని ఎమ్మెల్యే ను నిలదీశారు. టౌన్ పోలీసులు, సీఐ దేవేందర్ చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో ఎమ్మెల్యే మురళీనాయక్ స్కూల్‌ను ప్రారంభించకుండానే తిరిగి వెళ్లిపోయారు.