హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతకుముందు మాగంటి గోపీనాథ్ మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిథులు, నాయకులు గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు చేరుకున్నారు. గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.