హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పులి మీద స్వారీ చేస్తున్నారు. చెరువుల(Ponds) ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni )అన్నారు. బుధవారం మగ్దూం భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడా రు. చెరువు శికం భూమిలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నా రు. కవిత విడుదలను రాజకీయం చేస్తున్నారు. కవిత ఆడపిల్ల. ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి .
ఆమెకు బెయిల్ రావ డాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఆడపిల్ల మీద అంత కక్ష ఎందుకు అని ప్రశ్నించారు. రాజకీయంగా ఏమైనా చేయాలనుకుంటే కేసీఆర్తో చూసుకోండి ఆమెపై రాజకీయం ఎందుకన్నారు.రుణమాఫీ విషయంలో పట్టింపులు ఎందుకు. ఇచ్చినవి ఇచ్చాము అని చెప్పండి. ఇవ్వనివి ఇవ్వ లేదు అని చెప్పండి. రేషన్ కార్డు నిబంధన ఎందుకని చిన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వారికి రుణమాఫీ చేయాలన్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా గుర్తించాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని స్పష్టం చేశారు. అది ముస్లిం, హిందువుల మధ్య జరిగిన ఘర్షణ కాదన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలన్నారు. ఆర్ఎస్ఎస్కు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు అసలే సంబంధం లేదని గుర్తు చేశారు. హైడ్రాతో(Hydra) కబ్జా దారులు భయపడాలి. పేదల ఇళ్లు కూల్చకూడదని సూచించారు.