హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలనే కాదు.. న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం అన్న మాటలతో ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన అనాలోచిత, అనుభవరాహిత్య నిర్ణయాలతో ప్రజలు సతమతం అవుతున్నారని చెప్పారు.