హైదరాబాద్: ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) అన్నారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు హుజూరాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తానన్నారు. ప్రజల ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి జడ్జి బెయిల్ మంజూరు చేసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.
గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కౌశిక్‌రెడ్డిని కొండాపూర్‌లోని తన నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేందుకు అవకాశాలున్నా రాత్రి పొద్దుపోయే దాకా పీఎస్‌లోనే నిర్బంధించారు. రాత్రి 10.30 గంటలు దాటిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి కొత్తపేటలోని న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. వాదనలు విన్న జడ్జి.. రిమాండ్‌ను తిరస్కరించారు. రూ.5 వేలు జరిమాన, ఇద్దరి పూచీకత్తుతో కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిపై పెట్టిన అక్రమ కేసులో కోర్టు బెయిల్ మంజూరు
ఈ కేసు పూర్తిగా కక్ష్యసాధింపు చర్యగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రజాసేవలో ముందుండే నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు తగదని న్యాయస్థానం… pic.twitter.com/pulK7Y1B0h
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) December 5, 2024