Student Lasya | లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని మార్చురీ వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నా
కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థిని లాస్య ఆకస్మిక మృతి విచారణ చేపట్టి బాలి కుటుంబానికి న్యాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
తొగుట : కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థిని లాస్య ఆకస్మిక మృతి విచారణ చేపట్టి బాలి కుటుంబానికి న్యాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన వద్ద లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని మార్చురీ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాగా, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆకస్మిక మృతి స్థానికంగా కలకలం రేపింది.
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడికందులకు చెందిన దావులగల్ల లాస్య సిద్దిపేట మండలం రాఘవపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆరోగ్యంగా ఉన్న లాస్య దసరా సెలవుల అనంతరం యథావిధిగా హాస్టల్‌కు వెళ్లింది. అయితే, అనూహ్యంగా ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులను, గ్రామస్తులను తీవ్ర విషాదానికి గురిచేసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పాఠశాల నుంచి లాస్య తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. లాస్య పుష్పవతి అయిందని సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు.
గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో హాస్టల్‌కు వెళ్లిన తల్లిదండ్రులకు, అప్పటికే లాస్య ఆరోగ్యం క్షీణించడంతో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు. అయితే, హాస్పిటల్‌కు చేరుకునే సమయానికే లాస్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తె ఆకస్మికంగా మృతి చెందడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాస్య మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం లాస్య మృతదేహం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student Lasya | లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని మార్చురీ వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నా
Kumar Sangakkara | క్రికెటర్ సంగక్కరకు ఐర్లాండ్‌లో చేదు అనుభవం.. ర్యాన్ఎయిర్ ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు..!
Shrasti Verma | జానీ మాస్టర్‌కు శ్రేష్టి వర్మ కౌంటర్.. ‘నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నోరు మూయించలేరు!’
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన : వీడియో
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

