దుబ్బాక, మార్చి10: రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నుంచి నీటిని ఇవ్వలేక దౌర్భాగ్యపు పాలన కొనసాగిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి, కమ్మర్‌పల్లిలో ఆయన పర్యటించారు. మల్లన్న సాగర్ 4ఎల్ డిస్ట్రిబ్యూటర్ ఉప కాల్వల పనులతో పాటు, ఎండిన వరి పంటలను పరిశీలించారు. తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ దుబ్బాక నియోజకర్గంలో సాగునీటి సమస్య నెలకొనడం బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు.