Rajagopal Reddy | తండ్రినే గౌరవించలేని ఆమె ప్రజలకు తల్లి ఎలా అవుతుంది?..ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఆయన కుమార్తె కవిత విమర్శించడం సరికాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
- కేసీఆర్ వల్లే కవితకు గుర్తింపు
- తండ్రిని విమర్శించడం సరికాదు
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్, ఏప్రిల్ 29 : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఆయన కుమార్తె కవిత విమర్శించడం సరికాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కవిత పెట్టిన పార్టీపై స్పందించారు. కూతురుకి తండ్రి అంటే ప్రేమ ఉండాలని సూచించారు. పార్టీ పెట్టిన తొలి మీటింగ్‌లోనే తండ్రిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. తండ్రినే గౌరవించలేని ఆమె ప్రజలకు తల్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే ఆమెకు రాజకీయంగా పేరొచ్చిందని గుర్తుచేశారు. లిక్కర్ కేసులో ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని తెలిపారు. కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేసేముందు ఆమె తనపై ఉన్న కేసుల విషయమై స్పష్టత ఇవ్వాలని సూచించారు. కవిత పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని అన్నారు. పార్టీ పెట్టడం అంటే పాన్‌షాపు పెట్టినంత సులభం కాదని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

