హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ‘యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నేపాల్‌లో అవినీతి పాలనను కూల్చేందుకు అక్కడి యువకులు పోషించిన పాత్రే ఇందుకు నిదర్శనం’ అని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వంపైనే ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరోసారి విమర్శల దాడికి దిగారు. ఈ మేరకు బుధవారం నిరుద్యోగులతో కలిసి గన్‌పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపానికి నివాళులర్పించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి సొంత ప్రభుత్వ తీరుపైనే విరుచుకుపడ్డారు. ‘యువతను గాలికి వదిలేయొద్దు. వారికి దారి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నది’ అని స్పష్టంచేశారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పాలకులు రాజకీయ, ఆర్థిక కోణంలో కా కుండా సామాజిక, మానవీయ కోణంలో ఆ లోచించినప్పుడే నిరుద్యోగ యువతకు న్యా యం జరుగుతుందని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, గ్రూప్-1, గ్రూప్-2 వంటి ఉద్యోగాలను పారదర్శకంగా నిర్వహిస్తారని నిరుద్యోగులు భావించారని తెలిపారు. కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయామని, 50 వేల ఉద్యోగాలే ఇచ్చామని చెప్పారు. మిగతా 1.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని 30 లక్షల మంది నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ ఆలస్యమైన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంగీకరించారు. దీంతో నిరుద్యోగులు భావోద్వేగాలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నరని తెలిపారు. నిరుద్యోగ యు వతకు న్యాయం చేసేలా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా జూన్ 2న ఉద్యోగ ఖాళీల కు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని సీఎంను, ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. ప్రైవేటు రంగంలోనూ ఉగ్యోగాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అశోక్‌నగర్ చౌరస్తాకొస్తా
‘ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో 30 లక్షల మంది నిరుద్యోగులు కన్నీళ్లతో కష్టాల్లో ఉన్నారు. నేను గన్‌పార్క్‌కు వస్తున్నా అని తెలిసి.. వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి రావడానికి సిద్ధమయ్యరు. కానీ వందలాది మంది పోలీసులను పెట్టి వారిని నిర్బంధించారు. మీరు రావాల్సిన అవసరం లేదు. నేనే మీ వద్దకొస్తా. సిటీ సెంట్రల్ లైబ్రరీకి, అశోక్‌నగర్ చౌరస్తాకు, దిల్‌షుక్‌నగర్‌కు వస్తా. అమరవీరుల సాక్షిగా నిరుద్యోగ యువతకు మాటిస్తున్నా. మీకు న్యాయం జరిగే వరకు మీ సమస్యను ప్రభుత్వ, సీఎం దృష్టికి తీసుకెళ్తా. మీరు కన్న కలల కోసం, మీ ఆశయాల కోసం, మీకు తోడుంటా, మీ వెనుకాలే ఉంటా. ఒక అన్నగా, కుటుంబ సభ్యుడిగా మాట ఇస్తున్నా’ అని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. ప్రజ సమస్యలను భుజంపై వేసుకున్న తాను వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రభుత్వానికి మేలే చేస్తుందని చెప్పారు.
గ్రామాలను గాలికొదిలేశారు.. ప్రజలు కష్టాల్లో ఉన్నరు
రెండేండ్లు గడుస్తున్నా రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పెట్టడం లేదని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. తద్వారా గ్రామాలను గాలికొదిలేశారని సొంత సర్కారుపైనే విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో పాలన కుంటుపడిందని, ప్రజలు కష్టాల్లో ఉన్నరని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల్లో కనీసం మురుగు కాలువలు తీసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపారు. ప్రజలు త్వరగా స్థానిక ఎన్నికలు పెట్టాలని కోరుతున్నరని చెప్పారు.
ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ విఫలం ; నిరుద్యోగ జేఏసీ నాయకుడు వెంకటేశ్
ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిరుద్యోగ జేఏసీ నాయకు డు కయ్య వెంకటేశ్ విమర్శించారు. కాం గ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డి మాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ హక్కు ల వేదిక అధ్యక్షుడు అశోక్ చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా బుధవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరరీ సెంటర్ వద్ద నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాం డ్ చేశారు. దీక్ష చేపట్టిన అశోక్‌ను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.