షాబాద్, అక్టోబర్ 13: ‘పేరు బీఆర్ఎస్.. తీరు కాంగ్రెస్’ అన్నట్టు ఉన్నది చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వ్యవహారం. బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకొంటూ కాంగ్రెస్ మీటింగ్లకు హాజరవుతున్నారు. సోమవారం చేవెళ్లలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన భీంభరత్, బీఆర్ఎస్ తరఫున గెలిచిన కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యే కాలె యాదయ్య వర్గాల నాయకులు గొడవకు దిగారు. ఎమ్మెల్యే యాదయ్య సమావేశానికి వచ్చి పార్టీ పెద్దలకు షేక్ హ్యాండ్ ఇచ్చి వారితో మాట్లాడారు. పది రోజుల క్రితం చేవెళ్లలో ప్రెస్మీట్ పెట్టిన ఎమ్మెల్యే కాలె యాదయ్య తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నట్టు చెప్తూనే కాంగ్రెస్ మీటింగ్లకు హాజరవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.