వికారాబాద్, సెప్టెంబర్ 30: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కాలె యాదయ్యకు కుర్చీ వేయడం చర్చానీయంశంగా మారింది.బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన యాదయ్య కాంగ్రెస్‌పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మండల కేంద్రంలోని లింగంపల్లి ఫంక్షన్హాల్లో మంగళవారం పార్టీ మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. దీనికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్‌లో చేరిన కాలె యాదయ్యపై ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే తాను ఇంకా బీఆర్ఎస్లో నే ఉన్నానని కాలె యాదయ్య స్పీకర్, మీడియాతోనూ చెప్పడంతో ఈ సమావేశంలో ఆయన కోసం ప్రత్యేకంగా కుర్చీ వేశారు.