హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం మొదలైందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో బీజేపీ ఖాతాలు క్లోజ్ అవుతాయని, తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఏమాత్రం ఉండదని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని తెలిపారు. రేవంత్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, ఇకడ కాంగ్రెస్ గెలుస్తుందని పగటికలలు కంటున్నాడని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినవి సిగ్గుమాలిన వ్యాఖ్యలని దుయ్యబట్టారు.