ఖైరతాబాద్, డిసెంబర్ 30: ‘జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి హత్యా రాజకీయాలను మానుకోవాలి. నాపై కక్షగ ట్టి దాడులు చేయిస్తున్నాడు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతలు స్పందించి న్యాయం చేయకుంటే హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆత్మహత్య చేసుకుంటా’ అని మిడ్జిల్ మండలం మల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌నేత కొప్పుల మధు స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి స్థానికంగా హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
కష్టపడి గ్రామస్థాయి నుంచి టీపీసీసీ కోఆర్డినేటర్ స్థాయికి ఎదగానని తెలిపారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరఫున జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోరు తూ అధిష్టానికి దరఖాస్తు చేసుకున్నానని, అప్పటి నుంచి అనిరుధ్‌రెడ్డి కక్షగట్టారని ఆరోపించారు. దళిత సామాజికవర్గానికి చెందిన తనపై తరచూ దాడులు చేయిస్తూ హత్య చేయించేందుకు పురికొల్పాడని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి పేషీలో వినతిపత్రాలు అందజేశానా, న్యాయం జరుగకపోగా, తనపై హ త్యాయత్నం చేసిన వారిని కాపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల పం చాయతీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో తల్లిని పోటీ చేయించానని, ఎమ్మె ల్యే తన మనుషులతో కుటుంబంపై దుష్ప్రచారం చేసి ఓడించాడన్నారు. ఈ విషయం పై ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు దాడి చేయించారని వాపోయారు. తనకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్, డి ప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ స్పందించి న్యాయం చేయకుంటే గాంధీభవన్‌కు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నుంచి కొడుకుకు ప్రాణహాని ఉన్నదని మధు తల్లి కొప్పుల వెంకటమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైనా జరిగితే ఆయనే బాధ్యుడని తేల్చిచెప్పారు.