సూర్యాపేట : నాణ్యమైన కంపెనీ మందులు రైతులకు అమ్మి వారి మన్ననలు పొందాలని సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పేర్కొన్నారు. బుధవారం స్థానిక జనగాం క్రాస్ రోడ్ గాంధీనగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వీరాంజనేయ ట్రేడర్స్ సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ షాపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత స్వశక్తితో ఎదిగి వ్యాపార రంగంలో రాణించి అభివృద్ధి చెందాలన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన మందులు యూరియా, డీఏపీ బస్తాలు నాణ్యమైనవి అందజేసి వారి అభ్యున్నతికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు ధరావత్ సురేష్, 13వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ రఫీ, వార్డు ఉపాధ్యక్షుడు బి.జానీ నాయక్, శైలేంద్ర చారి, వేణు గౌడ్, బాలెంల ఉప్పలయ్య, వెంకన్న, జక్కలి సైదులు, కనకయ్య, నరసింహ, కే. శ్రీనివాస్, లింగ నాయక్, రవి, రాము, సుమన్ తదితరులు పాల్గొన్నారు.