హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్ర ఆదాయం(State revenue) తగ్గిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy )స్పందించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారు. అందువల్లే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నరాని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
అలాగే రుణమాఫీ పైసలు, 4 వేలు పెన్షన్, మహిళలకు ఇస్తానన్న రూ.2500, ఆటో కార్మికులకు ఇస్తానన్న రూ.12 వేలు, రైతు కూలీలకు ఇస్తానన్న రూ.1000, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు రావాల్సిన తులం బంగారం ఇవ్వన్నీ కాంగ్రెస్ మంత్రులు, నాయకుల జేబుల్లోకి పోతున్నాయి. అందుకే రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జేబులు నింపుకుంటున్నారు.. అందుకే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకున్నారు
రుణమాఫీ పైసలు, 4 వేలు పెన్షన్, మహిళలకు ఇస్తానన్న రూ.2500, ఆటో కార్మికులకు ఇస్తానన్న రూ. 12 వేలు, రైతుకూలీలకు ఇస్తానన్న రూ. 1000, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు రావాల్సిన తులం… pic.twitter.com/kufbHkb45g
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2024