సూర్యాపేట : కారే రావాలి.. సారే కావాలి..ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు. ఇద్దరు మంత్రులు ఉన్నా నీళ్లు ఇవ్వలేదు. రెండు పంటలకు నీళ్లిచ్చిన భగీరథులు కేసీఆర్, మీరే అంటూ పలువురు మహిళలు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో(MLA Jagadish Reddy) తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దూపహాడ్లో(Dupahad village) శుక్రవారం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో(Parliament election) భాగంగా దూపహాడ్ చేరుకున్న ఎమ్మెల్యేతో మహిళలు మాట్లాడారు.
ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోయాం. మళ్లీ కేసీఆర్ సారే రావాలి. మా లాంటి వారికి మంచి చేయడంలో
కేసీఆర్ లాంటి మొనగాడు లేడన్నారు. ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలనలో రెండు పంటలు పండించుకున్నం. ఇప్పుడు మా లిఫ్ట్ ను పట్టించుకున్న నాదుడే లేడని వాపోయారు. ప్రభుత్వమే చెప్పిందని పంటలు వేస్తే అవి కాస్తా ఎండిపోయినవి. ఇద్దరు మంత్రులు ఉన్నా ఉపయోగం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు.
వాళ్లకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా కంటే ఎక్కువగా కాలువలపై తిరిగి మా చివరి భూములలో కాళేశ్వరం నీళ్లు పారించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతుబంధు రాలేదు. మళ్లీ మోసపోము. గులాబీ జెండానే మాకు అండ అంటూ సంభాషణ సాగింది. కాగా, దూపహాడ్ మహిళల వేదన రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనకు అద్దం పడుతున్నదని పలువురు చర్చించుకుంటున్నారు.