సిద్దిపేట అర్బన్/గుమ్మడిదల, జూన్ 3: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పుట్టిన రోజు వేడుకలు సోమవారం పండుగలా జరిగాయి. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం కోలాహలంగా మారింది. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌కు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నందిని సిధారెడ్డి, దేవీప్రసాద్, ఫారుఖ్ హుస్సేన్, విరాహత్ ఆలీ, వంటేరు ప్రతాప్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సిద్దిపేట మోడల్ బస్టాండ్ వద్ద అన్నదానం చేశారు. సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ యువనాయకుడు, కొత్తపల్లి గ్రామ యువనేత యావన్నగారి సంతోష్‌రెడ్డి హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు తరాలకు బాటచూపే నాయకుడు హరీశన్న చూపే మార్గంలోనే పయనిస్తానని సంతోష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనే తన శ్వాస, స్ఫూర్తిగా జిల్లా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.