ఆర్డీఎస్ఎస్ అమలుతో తెలంగాణ చీకటే
‘ఆర్డీఎస్ఎస్(రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) అమలుతో వి ద్యుత్ వినియోగదారుల నెత్తిన పిడుగుపడబోతున్నది. ఫ్రీ పవర్ స్కీమ్ గృహజ్యో తి పథకం కనుమరుగుకానున్నది.
- విద్యుత్‌రంగం ప్రైవేటీకరణకు సర్కార్ కుట్ర
- ఈ స్కీమ్‌తో వినియోగదారులకు శాపం
- రైతు డిస్కమ్‌ను అదానీకి కట్టబెట్టే యత్నం
- స్కీమ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, మే 24(నమస్తే తెలంగాణ): ‘ఆర్డీఎస్ఎస్(రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) అమలుతో వి ద్యుత్ వినియోగదారుల నెత్తిన పిడుగుపడబోతున్నది. ఫ్రీ పవర్ స్కీమ్ గృహజ్యో తి పథకం కనుమరుగుకానున్నది. లాండ్రీ లు, సెలూన్లకు ఇచ్చే 250 యూనిట్ల ఫ్రీ కరెంట్‌ను ఎత్తేసే ప్రమాదమున్నది. వెరసి తెలంగాణ మొత్తం చీకటయ్యే పరిస్థితి కనిపిస్తున్నది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ స్కీమ్ రైతాంగానికి శాపంగా మారనున్నదని స్పష్టంచేశారు. ఆర్డీఎస్ఎస్ ముసుగులో దక్షిణ, ఉత్తర విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించేందుకు రేవంత్ సర్కార్ కుట్ర పన్నుతున్నదని విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు వ్యతిరేకించిన ఈ ప థకాన్ని తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం దారుణమంటూ ధ్వజమెత్తారు. ఆదివా రం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత లు ఓ నర్సింహారెడ్డి, ఉపేంద్ర, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వెంకటనారాయణగౌడ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాడు ప్రతిపక్షంలో ఎగిరెగిరిపడ్డ రేవంత్‌రెడ్డి.. ఇవాళ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవడం శోచనీయమని మం డిపడ్డారు. ప్రభుత్వం తీసుకురానున్న రైతు డిస్కమ్‌ను అదానీకి కట్టబెట్టే కుటిలయత్నం జరుగుతున్నదని ఆరోపించారు.
నాడు కేసీఆర్ వ్యతిరేకించారు
ఆర్డీఎస్ఎస్లో చేరాలని కేంద్రం ఒత్తి డి తెచ్చినా కేసీఆర్ మొదటినుంచీ వ్యతిరేకించారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఎట్టిపరిస్థితుల్లో మోటర్లకు మీటర్లు బిగిస్తే ఒప్పుకొనేది లేదని తెగేసి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్.. ఇప్పుడు గతంలో కేసీఆరే ఒప్పుకొన్నారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ‘ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్‌లో మీటర్లు పెడితే మ హిళలు తగులబెట్టారు.. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేసి వెనక్కి తీసుకున్నారు’ అని గుర్తుచేశారు. ఇవన్నీ తెలిసినా రేవంత్ మాత్రం బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. యూపీ లో వ్యతిరేకించిన కాంగ్రెస్.. తెలంగాణ లో అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా అని ఎద్దేవా చేశారు.
స్మార్ట్‌మీటర్లతో తీరని నష్టం
స్మార్ట్ మీటర్లతో ప్రజలకు నష్టం జరుగుతుందని, ముందు రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుందని, లేదంటే కట్ అవుతుందని స్పష్టంచేశారు. ఈ మీటర్లు పెట్టుకొనేందుకు రూ.6వేల దాకా ఖర్చవుతుందని, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇచ్చే కమీషన్లతో ఇంకా ఎంతకు పోతుందో తెలియదంటూ దెప్పిపొడిచారు. రూరల్ డిస్కమ్ తెచ్చి అదానీకి అప్పగించేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌ను త్వరలోనే ప్ర జలు బంగాళాఖాతంలో విసిరివేయ డం ఖాయమని హెచ్చరించారు. ఆర్డీఎస్ఎస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

