నిజామాబాద్ : పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యతలో భాగంగా ఎమ్మెల్సీ కవిత తన వంతు సహకారం అందించారు. జిల్లాలోని వివిధ యువజన సంఘాల కోరిక మేరకు 108 వినాయక మండపాల నిర్వాహకులకు భారీ మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నగర మేయర్ నీతు కిరణ్ మట్టి వినాయక విగ్రహాలను వివిధ గణేష్ మండప నిర్వాహకులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పర్యావరణాన్ని రక్షించుకోవాలని తన సొంత డబ్బులతో 108 భారీ మట్టి విగ్రహాలను అందజేసిన ఎమ్మెల్సీ కవికు ధన్యవాదాలు తెలిపారు. ఒక నాయకురాలిగా తాను అన్ని సందర్భాల్లో తన బాధ్యత నిర్వర్తిస్తున్నారని తెలిపారు. భవిషత్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపట్టాలని, వారికి ఆ వినాయకుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. యువత భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్ కిషన్ రావు, భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, చిన్ను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.