జయశంకర్ భూపాలపల్లి : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాల్లో పైగా గెలుపొంది మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం
జిల్లా కేంద్రంలోని ఘనపురం మండలం గాంధీనగర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే గండ్రకు ఘన స్వాగతం పలికారు. గాంధీనగర్ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎలాంటి ఏజెండా లేదు. వారికి పని చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పా మరో పని లేదన్నారు. విమర్శలు చేయడం తప్పు కాదని, వ్యక్తిగత స్వార్థంతో కాకుండా సహేతుకమైన విమర్శలు చేయాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి గెలుపు బాటలు వేస్తాయన్నారు.