జగిత్యాల, సెప్టెంబర్ 13 : బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఎక్స్ ఖాతా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలు డిలీట్ చేశారు. మాకునూరి సంజయ్‌కుమార్ అఫిషియల్ సోషల్ అకౌంట్లలో రేవంత్‌రెడ్డితో ఉన్న ఫొటోలు తొలగించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
సుప్రీం కోర్టు ఆదేశాలతో అసెంబ్లీ స్పీకర్ చర్యలు, నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎక్స్ అకౌంట్ నుంచి రేవంత్‌రెడ్డి ఫొటోలు తీసివేసి, కేవలం తన ఒక్కడి ఫొటో ఉంచడం గమనార్హం.