కొండాపూర్, సెప్టెంబర్ 5 : బోధనలో వినూత్న విధానాల ఆవశ్యకత అవసరమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైటెక్‌సిటీలోని ఓ హోటల్లో ఏకలవ్య ఓటీటీ యాప్ ఆవిష్కరణకు మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా నాణ్యమైన విద్యనందించే టెక్నాలజీతో రూపొందించిన యాప్‌గా ఏకలవ్య ఓటీటీని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఉత్తమ అధ్యాపకులతో ఉన్నత విద్యను స్వదేశంలోనే అందిస్తే విదేశాలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని స్పష్టంచేశారు. ఈ యాప్‌లో కేజీ టు గ్రేడ్-12 వరకు అవసరమైన ఐఐటీ, జేఈఈ, నీట్ పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయని ఏకలవ్య ఓటీటీ కో ఫౌండర్, సీఈఓ అనిల్ దీపక్ వెల్లడించారు. కార్యక్రమంలో ఏకలవ్య చైర్మన్ సంతోష్‌రెడ్డి, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ జీఎం పెండెం వెంకటనగేశ్, విశ్వనాథం, అజయ్‌కుమార్ కొండపర్తి, అనుమండ్ల నటరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.