సారంగాపూర్, ఏప్రిల్ 8: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మంగళవారం స్వగ్రామంలోనే నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ మండలంలోని గుండారం, జలాల్పూర్లో నిర్వహించిన సమావేశాల్లో మహిళలు వేదిక వద్దకు దూసుకొచ్చి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ‘రెండు నెలలు ఓపిక పట్టండి.. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తాం’ అని ఎమ్మెల్యే సర్దిచెప్పబోయారు. స్వగ్రామంలో తాగునీటి సమస్యలపై మహిళలు నిలదీయగా సమస్యను వెంటనే పరిష్కరించాలని అక్కడున్న అధికారులకు భూపతిరెడ్డి సూచించారు.