e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News Huzurabad | ద‌ళితుల‌పాలిట యముడు ఈట‌ల‌.. క‌బ్జాల బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే బీజేపీలో చేరిక!

Huzurabad | ద‌ళితుల‌పాలిట యముడు ఈట‌ల‌.. క‌బ్జాల బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే బీజేపీలో చేరిక!

Huzurabad | హుజూరాబాద్‌కు ఎమ్మెల్యేగా ఉంటూ ఈట‌ల రాజేంద‌ర్ చేయ‌ని దుర్మార్గం లేద‌ని, ద‌ళితుల పాలిట యుముడిలా ఆయ‌న త‌యార‌య్యాడ‌ని ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ చెప్పారు. కమలాపూర్‌లో ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఆయ‌న మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ మాసాయిపేట గ్రామంలో భూములు కబ్జా చేశాడ‌ని, బాధిత ఎస్సీలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ వేసిందన్నారు. ఆ విచార‌ణ‌లో త‌న బాగోతం ఎక్క‌డ బయటపడుతుందోన‌నే భ‌యంతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

బీజేపీ ఫ‌క్తు రైతు వ్య‌తిరేక పార్టీ అని, రైతుల నెత్తురు కండ్ల‌జూడందే ఆ పార్టీ నేత‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌ద‌ని చెప్పారు. మ‌హారాష్ట్ర‌లో రైతుల మార‌ణ‌హోమాన్ని చూస్తూనే ఉన్నామ‌ని చెప్పారు బాల్క సుమ‌న్‌. మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టే బీజేపీ వంటి గలీజ్ పార్టీ మ‌రొక‌టి లేద‌న్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈట‌ల రాజేందర్ డబ్బులు మద్యం నమ్ముకొని పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ రాజకీయంగా పెంచి పెద్ద చేస్తే.. ఆయ‌న‌కే వెన్నుపోటు పొడిచేందుకు ప్రతిపక్ష నాయకులతో కుట్రలు చేసినట్లు విమర్శించారు. అందుకోస‌మే ప్ర‌జ‌లు మంచి చెడుల‌ను గుర్తించి, టీఆర్ఎస్‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌లంలోని ఆటో డ్రైవ‌ర్లు, పలువురు నాయ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement