Arekapudi Gandhi | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వ్యవహారశైలిని ప్రజలు చీదరించుకుంటున్నారు.మహాత్ముడి పేరు పెట్టుకున్న ఆయన ఆ పేరును చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. నైతిక విలువలు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండటంపై సొంత నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలక్రితం తాను సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించుకు న్న ఆయన.. ఇప్పుడేమో తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ నాలుక మడతేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసినట్టు బుకాయిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ సూచించిన సభ్యునికి ఇవ్వాల్సిన పీఏసీ కమిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దక్కించుకున్నారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నది. దీం తో అరికపూడి గాంధీ ప్లేట్ ఫిరాయించా రు. తాను కాంగ్రెస్‌లో చేరలేదంటూ అబద్ధాలు చెప్తున్నారు.
నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన…
జూలై 13న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాం గ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. ‘ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో సీనియర్ నాయకుడు మొవ్వ సత్యనారాయణ, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్‌రెడ్డి, ని యోజకవర్గ సీనియర్ నాయకులు, ము ఖ్య అనుచరులు, అభిమానులతో కలిసి కాంగ్రెస్‌లో చేరడం జరిగింది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రేవంత్‌రెడ్డికి, రాహుల్ గాంధీకి, ఐఎన్‌సీ తెలంగాణ, ఇండియాకు ట్యాగ్ చేశారు. నాడు ఇంత అర్భాటంగా కాంగ్రెస్‌లో చేరినట్టు ప్రకటించుకొని, ఇప్పుడేమో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనేలేదంటూ ప్లేట్ ఫిరాయించడంపై నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ధ్రువీకరించిన వేం నరేందర్‌రెడ్డి
అరికపూడి కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ధ్రువీకరించారు. ఆయన కూడా జూలై 13న తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నా రు. ‘శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పలువురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. కాంగ్రె స్ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది’ అంటూ వారి ఫొటోను జత చేశా రు. అరికపూడి కాంగ్రెస్‌లో చేరారనేందు కు ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి.
మెడలో మెరుస్తున్న కాంగ్రెస్ కండువా
అరికపూడిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పా రు. తన మెడలో కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, అది ఆలయాల్లో కప్పే కండువా అని గాంధీ చెప్పుకొచ్చారు. ఫొటోల్లో మాత్రం ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి మెడలో దేవాలయాల్లోని కండువా ఉంటే అరికపూడి గాంధీ మెడలో కాంగ్రెస్ కండువా కనిపిస్తున్నది. తన మెడలో దేవాలయ కండువా కప్పిన సీఎం రేవంత్‌రెడ్డి పార్టీలో చేరిన మిగిలిన వారికి మాత్రం కాంగ్రెస్ కండువా కప్పారని కూడా గాంధీ తెలిపారు. ఆ ఫొటోలో తనతోపాటు పార్టీలో చేరిన వారందరి మెడలో కాంగ్రెస్ కండువా ఉండటం గమనార్హం.