Governor Hari Babu | హైదరాబాద్ : మిజోరం గర్నవర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు గవర్నర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది.
గత ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారని, దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ విక్రమ్ వర్మ జంపన్న, డాక్టర్ చందన రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం హరిబాబుకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Manipur | మణిపూర్లో మళ్లీ కర్ఫ్యూ.. ఇంటర్నెట్ సేవలు బంద్
Kejriwal Govt | కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి
Rahul Gandhi | రాహుల్ ఎన్నటికీ దేశ ప్రధాని కాలేరు : లలన్ సింగ్