Exit Polls | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ సర్వేల్లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. కొన్ని సంస్థలు కాంగ్రెస్, బీజేపీలకు అధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా.. మరికొన్ని సంస్థలు బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశమున్నదని వెల్లడించాయి. సీ-ప్యాక్ సంస్థ బీఆర్ఎస్ 11సీట్లకు పైగా గెలుచుకుంటుందని అంచనా వేయగా, న్యూస్-18 మాత్రం రెండు నుంచి ఐదు స్థానాలు సాధించే వీలున్నదని తెలిపింది. సునీల్ వీర్ బృందం బీఆర్ఎస్ రెండు సీట్లకన్నా ఎక్కువ సాధించే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. దాదాపు అన్ని సర్వే సంస్థలు మజ్లిస్ పార్టీ ఒక సీటు సాధిస్తుందని పేర్కొన్నాయి.