మకే : సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన అవమానకర ఓటమికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన సెకండ్ టెస్టులో ఆసీస్.. ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 750 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్ పది వికెట్ల ప్రదర్శన (10/51)తో బంగ్లాను బెంబేలెత్తించాడు.
మొదటి రోజు బంగ్లా 64 రన్స్‌కే ఆలౌట్ అవగా కంగారూలు తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన శాంతో సేన.. స్టార్క్ (4/39) విజృంభణకు తోడు కమిన్స్ (3/10), లియాన్ (3/25) ధాటికి 95 రన్స్‌కే చాపచుట్టేసింది. ఈ టెస్టును ఆసీస్ గెలవడంతో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.