తమిళ అగ్ర నటుడు శింబు ఓ తెలుగు సినిమాలో ప్రత్యేకపాత్ర పోషించబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’లో మనోజ్ అన్నయ్యగా శింబు కనిపిస్తారట. కేవలం ఫ్లాష్బ్యాక్లోనే శింబు పాత్ర వస్తుందని టాక్ నడుస్తున్నది.
నిజానికి శింబు, మనోజ్ మంచి ఫ్రెండ్స్. గతంలో మనోజ్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ సినిమాలో ‘బుజ్జి పిల్లా’.. అంటూ ఓ పాట కూడా పాడారు మనోజ్. ఇప్పుడు ఫ్రెండ్ కోసం ఈ క్యారెక్టర్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది.