అచ్చంపేట, ఆగస్టు 23: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో నాగర్‌కర్నూల్ క్రీడాకారులు సత్తాచాటారు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మొదటి వరల్డ్ ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్-2026లో నాగర్‌కర్నూల్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ తరఫున రాథోడ్ రాజునాయక్ టోర్నమెంట్ గ్రాండ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. 12 దేశాలతో పాటు దేశంలోని 22 రాష్ర్టాల నుంచి 2,100 క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో నాగర్‌కర్నూల్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టోర్నమెంట్ గ్రాండ్ చాంపియన్‌గా నిలిచారు. అదేవిధంగా రాజునాయక్ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రపంచ రికార్డు సాధించడంతో వివిధ విభాగాల్లో స్వర్ణపతకాలు సాధించాడు.