కోల్‌కతా : ప్రతిష్టాత్మక డ్యూరండ్ కప్‌లో ఈస్ట్ బెంగాల్ రెండు దశాబ్దాల తర్వాత ట్రోఫీ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు.. 4-1తో తమ చిరకాల ప్రత్యర్థి మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్‌ను ఓడించి 22 ఏండ్ల తర్వాత మళ్లీ డ్యూరండ్ కప్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్లో ఆ జట్టు తరఫున ఎడ్మండ్ లాల్రిండికా (12వ, 22వ, 44వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్ కొట్టగా బిపిన్ (10వ) ఒక గోల్ చేశాడు. 2004లో బెంగాల్.. 2-1తో మోహన్ బగాన్‌ను ఓడించి టైటిల్ గెలిచిన అనంతరం మళ్లీ ఆ జట్టు ఈ ట్రోఫీని నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ట్రోఫీతో డ్యూరండ్ కప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టుగా ఈస్ట్‌బెంగాల్.. మోహన్ బగాన్(17)తో సమానంగా నిలిచింది.