హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష తుది ‘కీ’లో తప్పులున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. ఈ తప్పులను సింగరేణి సంస్థ సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా సవరించలేదని, తమకు అన్యా యం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 139 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి మార్చి 1న నోటిఫికేషన్ జారీచేయగా, జూలై 21న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 7న ప్రాథమిక కీని విడుదల చేయగా, పలువురు అభ్యర్థులు ఆన్లైన్లో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆ తర్వాత ఫైనల్ కీని విడుదల చేశారు. ఈ పైనల్ కీపై అభ్యంతరాలు వ్యక్తంచే స్తూ ఈ నెల 10న అభ్యర్థులు సింగరేణి సీఎండీని కలిసి ఆధారాలు సైతం సమర్పించారు. తప్పులుంటే సవరిస్తామని సీఎండీ అభ్యర్థులకు చెప్పారు. కానీ సరిదిద్దికుండానే 17న ఫలితాలను ప్రకటించి, ప్రొవిజినల్ లిస్టును వెల్లడించారు. దీనిపై అభ్యర్థులు అధికారులను కలిసి గోడు వెల్లబోసుకోగా.. ‘తామేం చేయలేం. ఏదైనా ఉం టే కోర్టుకెళ్లి తేల్చుకోవాలి’ అని ఉచిత సలహానిచ్చినట్టు అభ్యర్థులు వాపోయారు.
అభ్యర్థుల అభ్యంతరాలివే..