హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా వచ్చినందున పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. పోస్టుల భర్తీకి ఆన్లైన్లోనే దరఖాస్తులను స్వీకరించామని చెప్పారు. ఈ క్రమంలో అభ్యర్థులు పొరపాటుగా వారి పేరు స్థానంలో తప్పుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, డిగ్రీ, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని టైప్ చేశారని వెల్లడించారు. మెరిట్ జాబితాలో పేర్లు పొరపాటుగా రావడానికి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలో చేసిన తప్పిదమే కారణమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతిఒకరూ గమనించాలని చంద్రశేఖర్ కోరారు.