న్యూఢిల్లీ, జూన్ 3 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం, అమెరికా-ఇరాన్ సీజ్‌ఫైర్‌పై అనిశ్చితి నెలకొనడంతో ఈ ధరలు భారీగా తగ్గాయి.
న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.1,850 లేదా 1.14 శాతం తగ్గి రూ.1,59,600కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,61,450గా ఉన్నది. కిలో వెండి రూ.1,500 తగ్గి రూ.2,69,500కి దిగొచ్చింది.