ఆహ్లాదాన్నిచ్చే పల్లె ప్రకృతివనం.. ఆపాత మాధుర్యాన్ని పంచే వస్తులోకం.. ఎటుచూసినా హరితహార మొక్కల పచ్చదనం.. సకల సౌకర్యాలతో వైకుంఠధామం, నిత్య పారిశుధ్య కార్యక్రమాలు, అద్దాల్లాంటి వీధులతో రాయికల్ మండలం భూపతిపూర్ మెరుస్తున్నది. పల్లె ప్రగతితో ఏండ్లనాటి దారిద్య్రాన్ని దూరం చేసుకుంటున్నది. మొన్నటిదాకా నిధుల లేమితో అల్లాడిన గ్రామం.. ఇప్పుడు నెలనెలా వస్తున్న ప్రగతి పద్ధతితో అన్ని వసతులు సమకూర్చుకొని ఆదర్శంగా నిలుస్తున్నది.