యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం చీరకట్టులో కొండపైకి చేరుకున్న ఆమె ముందుగా మాఢవీధుల్లోని ఈశాన్య ప్రాంతంలో గల అఖండజ్యోతికి మొక్కారు. గర్భగుడిలోకి వెళ్లి స్వయంభూ పంచ నారసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ఆలయ ముఖ మండపంలో వేద ఆశీర్వచనం అందించారు. స్వామి లడ్డూ ప్రసాదం, చిత్రపటం, శేష వస్ర్తాలను ఈవో భాస్కర్రావు అందజేశారు.