హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవం చాటి చెప్పేలా మిస్వరల్డ్ పోటీలను నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పోటీల నిర్వహణపై సమీక్ష నిర్వహించా రు. విభిన్న సంసృతులకు కొలువైన తెలంగాణ వైభవం ఒక హైదరాబాద్లోనే కా కుండా రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో నిక్షిప్తమై ఉందని, ఆయా ప్రాంతాలకు ప్రపంచ దేశాల సుందరీమణులను తీసుకెళ్లి, అక్కడి గొప్పదనాన్ని వివరించాలని పేర్కొన్నారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా పర్యాటకరంగ అభివృద్ధి, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రాష్ట్ర ఆర్థికవృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా వేదికల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు మంత్రికి అధికారులు వివరించారు. మరోవైపు పర్యాటకరంగలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.