హైదరాబాద్, మే 16 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మీర్జా రియాజ్ ఉల్ హస్సన్ అఫెండీతో శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.
మండలిలోని చైర్మన్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అబ్దుల్లా బలాల, జుల్ఫిఖర్ అలీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.